ఉపాధ్యాయుల బ‌దిలీల్లో స‌వ‌ర‌ణ జీవోను స‌స్పెండ్ చేసిన హైకోర్టు

© File Photo

ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీచేసిన జీవో 402ను తెలంగాణ‌ హైకోర్టు స‌స్పెండ్ చేసింది. టీచ‌ర్ల అంత‌ర్ జిల్లాల బ‌దిలీ జ‌రిగిన‌ప్పుడు సీనియారిటీ కోల్పోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో 402 జారీచేసింది. కానీ ఇది రాష్ట్ర‌ప‌తి ఉత్వ‌ర్వుల‌కు విరుద్ధంగా ఉంద‌ని ప‌లువురు ఉపాధ్యాయులు పిటిష‌న్లు వేశారు. దీనిపై సోమ‌వారం విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌సేన్ రెడ్డి జీవో అమ‌లును నిలిపివేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేశారు. దీనికి కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచార‌ణ‌ను జూన్ 20కి వాయిదావేసింది.

Exit mobile version