ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీలు నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఇటీవలే జీవో నెం.1ని విడుదల చేసింది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అభిప్రాయపడింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 23వరకు జీవోను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.