ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు KCRకు చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అబద్ధాలు హైకోర్టులో చెల్లలేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నీతి, నిజాయతీలకు కట్టుబడి ఉండే BJP నేతలను ఇందులోకి లాగి కేసీఆర్ ఘోర తప్పిదం చేశారని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేశారని విమర్శించారు.