జంతు ప్రేమికులకు బాంబే హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం అందించొద్దని.. అంత ప్రేమ ఉంటే ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకోండని ఘాటుగా బదులిచ్చింది. వీధికుక్కలను నిర్బంధించే హక్కు నాగ్‌పుర్ మున్సిపాలిటీ అధికారులకు ఉంటుందని గుర్తుచేసింది. కావాలనుకుంటే శునకాన్ని దత్తత తీసుకొని వీధుల్లో ఫీడింగ్ చేసుకోవచ్చని అనుమతిచ్చింది. వీధి కుక్కల బెడదపై 2006లో నమోదైన పిటిషన్‌ని విచారిస్తూ నాగ్‌పుర్ ధర్మాసనం ఇలా స్పందించింది. వీధుల్లో ఫీడింగ్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.