AP CM జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌజింగ్ బోర్డు కేసు నుంచి తమ పేర్లను తొలగించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రాథమిక దశలోనే సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చలేమని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. అభియోగపత్రంలోని అంశాలు విచారణలోనే తేలాలని, ఇప్పుడే పేర్లు తొలగించమనడం ముందస్తు చర్యే అవుతుందని కోర్టు పేర్కొంది.