దేశంలో ఈ ఏడాది చివరి కల్లా 8 వేల మంది కుబేరులైన యువ పారిశ్రామికవేత్తలు విదేశీ బాట పట్టనున్నారు. ఈ విషయాన్ని ‘2018 హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్’ వెల్లడించింది. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ) విదేశాల్లో ఎదిగేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ నివేదిక తెలిపింది. హెచ్ఎన్ఐలు భారీగా తరలిపోతున్న దేశాల్లో రష్యా, చైనా తర్వాత భారత్ ఉన్నట్లు పేర్కొంది. భారత్లో ప్రభుత్వాల కఠిన విధానాలు, పన్నునిబంధనలే హెచ్ఎన్ఐలు దేశాన్ని వీడటానికి ప్రధాన కారణాలని చెప్పింది. ఐటీ చట్టాలు, సోషల్ మీడియా నియంత్రణవల్ల టెక్ రంగ హెచ్ఎన్ఐలు రిస్క్ లేని దేశాలవైపు చూస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. అయితే దేశంలో ఏటా పుట్టుకొస్తున్న కొత్త హెచ్ఎన్ఐల వల్ల భారత్ కు ఈ వలసలతో నష్టం ఉందని నివేదిక అభిప్రాయపడింది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం