ఆంధ్రప్రదేశ్ పులివెందులలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతోంది. పులివెందుల వెళ్లేందుకు సీబీఐ అధికారులు ఎస్పీని భద్రత కోరారు. అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హాజరు కావాలని పేర్కొంది. కానీ, వివిధ పనుల కారణంగా అవినాశ్ 5 రోజుల సమయం కోరారు. అప్రమత్తమైన అధికారులు పులివెందుల వెళ్తున్నారు. దీంతో ఏం జరుగుతోందో అని ఉత్కంఠ నెలకొంది.