సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మరో కేసు నమోదైంది. ఆయనపై ఇప్పటికే హిందూపురంలో అనేక కేసులు ఉన్నాయి.ఇవన్నీ విపక్ష నేతలు కావాలనే పెట్టిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంటుంది. అయితే తాజాగా కొంతమంది హిజ్రాలు బాలయ్యపై కేసు పెట్టారు. తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్న మాటే గానీ బాలయ్య అస్సలు నియోజకవర్గంలో ఉండటం లేదని వారు కేసు పెట్టారు. ఇది కూడా స్థానిక YCP నేతలే పెట్టించారని ఇప్పటికే TDP ఆరోపిస్తోంది.
బాలకృష్ణపై కేసుపెట్టిన హిజ్రాలు
