రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి హిజ్రాలు ప్రసవం చేసి తల్లీ, బిడ్డ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన బిహార్లోని జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్లో చోటుచేసుకుంది. ఓ గర్భిణీ తన భర్తతో కలసి హౌరా నుంచి లఖిసరాయ్కు వెళ్తోంది. ఈ క్రమంలో ఆ మహిళకు నొప్పులు వచ్చాయి. భార్య వేదనను చూసిన భర్త అక్కడే ఉన్న మహిళలను సాయం అడగగా వారు నిరాకరించారు. పరిస్థితిని గమనించిన హిజ్రాల బృందం ఆమెను రైలులోని విశ్రాంతి గదికి తీసుకెళ్లి ప్రసవం చేయడంతో పండంటి మగబిడ్డ జన్మించాడు.