ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో మొట్ట మొదటిసారిగా హిందీకి ప్రాధాన్యం లభించింది. బహుభాషావాదంపై భారతదేశం ప్రవేశపెట్టిన ప్రాయోజిత తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో హిందీ భాషతో సహా అధికారిక, అనధికారిక భాషల్లో సమాచారం, సందేశాలు కొనసాగించనున్నారు. ఈ మార్పులను తాము స్వాగతిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రాయబారి TS తిరుమూర్తి తెలిపారు. హిందీతోపాటు బంగ్లా, ఉర్దూ భాషల ప్రస్తావన కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.