RRR మూవీ ఇప్పటికీ ఓటీటీలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. నెటిఫ్లిక్స్ టాప్ స్ట్రీమింగ్ మూవీస్ జాబితాలో ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్ మొదటి మూడు వారాలు టాప్ 1లో నిలిచింది. వరుసగా మూడు వారాలు టాప్‌లో ఉన్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక నాలుగోవారంలో రెండో స్థానానికి వెళ్లింది. శివకార్తికేయన్ నటించిన తమిళ మూవీ డాన్ గతవారం (జూన్ 6-12) నంబర్ వన్‌లో కొనసాగింది. మరోవైపు మలయాళ సినిమా జనగణమన తెలుగు వర్షన్ నెటిఫ్లిక్స్ జాబితాలో టాప్8లో నలిచింది.