కరోనా తర్వాత 6 శాతం పెరిగిన నియామకాలు

© Envato

కోవిడ్ -19 తగ్గిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ (MEI) నివేదిక తెలిపింది. దీంతో 2022 మార్చిలో నియామకాల డిమాండ్ 6% వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో మార్చిలో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ యాక్టివిటీ సంవత్సరం క్రితం స్థాయిని మించిపోయిందని పేర్కొంది. ఇక ముంబై అతిపెద్ద జాబ్ మార్కెట్‌గా 21%, కోయంబత్తూర్ 20% పెరుగుదలను నమోదు చేసినట్లు ప్రకటించింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI), టెలికాం విభాగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరిగినట్లు స్పష్టం చేసింది.

Exit mobile version