థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 43 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి అడుగుపెట్టి పతకం ఖాయం చేసుకుంది. గురువారం సాగిన క్వార్టర్ ఫైనల్‌లో మలేసియాను 3-2 తేడాతో ఓడించింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఓడినప్పటికీ, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి విజయం సాధించి భారత్‌ను పోటీలో నిలిపారు. తదనాంతరం కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించగా డబుల్స్‌లో కృష్ణప్రసాద్- విష్ణువర్థన్ ఓడటంతో స్కోర్లు సమమయ్యాయి. డిసైడింగ్ మ్యాచులో ప్రణయ్ గెలుపొంది జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ థామస్ కప్‌లో తొలిసారి పతకం అందుకోనుంది.