ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిదో జాతీయ పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్‌లో 5 సీట్లు సాధించడంతో ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. ఆప్‌కు ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్‌లలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, ఎన్పీపీ పార్టీలను జాతీయ పార్టీలుగా ఈసీ గుర్తించింది. ఇప్పుడు ఆప్‌ను జాతీయపార్టీగా ప్రకటించనుంది.