భారాస ఆవిర్భావ సభ ద్వారా ఖమ్మంలో చరిత్ర సృష్టించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్లో జరిగిన సింహగర్జన మాదిరిగా భారీ జనసమీకరణ చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు ఏపీ నుంచి ప్రజలు పాల్గొనేలా చూడాలని నేతలకు సూచించారు. సభ బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుతో పాటు పువ్వాడ, ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. పొంగులేటి ప్రస్తావన వచ్చిందని టాక్. స్వప్రయోజనాల కోసం పార్టీ మారే వారిని పట్టించుకోవద్దన్నారట.