ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 17,000 పరుగులు చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన 28వ అంతర్జాతీయ క్రికెటర్‌గా.. ఆరో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు సచిన్, ద్రావిడ్, గంగూలీ, కోహ్లీ, ధోనీలు ఉన్నారు. మరోవైపు సొంతగడ్డపై టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అజారుద్దీన్ తర్వాత వేగంగా 2 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.