హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బహదూర్ పల్లి, తొర్రూర్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ప్లాట్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొదటి రెండు రోజులు (మార్చి 14 నుంచి 16 వరకు) రూ.503.448కోట్ల ఆదాయం సమకూరినట్లు HMDA చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. అత్యధికంగా తొర్రూరులో రూ.152.02 కోట్ల ఆదాయం వచ్చిందని, అత్యల్పంగా వికారాబాద్లో రూ.0.907 కోట్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ వేలం నేటితో ముగియనుంది.