శాసన సభ సలహా కమిటీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా శాసనసభాపక్షం భేటీ అయ్యింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలు చర్చించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు బుధవారం సెలవు ప్రకటించడాన్ని తెదేపా శాసనసభాపక్షం తప్పుబట్టింది. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ రిసెప్షన్ కోసమే ఈ సెలవు ఇచ్చారని ఆరోపించింది. నేతల ఇళ్లలో వేడుకలకు సభ సమావేశానికి అంతరాయం కలిగిస్తారా? అంటూ ప్రశ్నించింది.