టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలివుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ను రంగంలోకి దించింది చిత్రబృందం. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు పనిచేశాడు యానిక్ బెన్, యశోదలో సమంతకు స్టంట్స్ నేర్పించాడు. పదిరోజులపాటు చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌ను సమంత కష్టపడి పూర్తిచేసినట్లు మేకర్స్ వెల్లడించారు. యశోద సినిమాకు హరి-హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.