• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాలివుడ్ లో ఇంకా తగ్గని ‘RRR’మేనియా

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లు రాబట్టింది. ప్రేక్షకులతో పాటు ఎంతో మంది సినీ మేకర్లు సినిమాపై ప్రశంసలు కురిపించారు. విడుదలై 3నెలలైనా ఇంకా సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. తాజాగా ’21 జంప్ స్ట్రీట్’ ‘ది లెగో’ ‘స్పైడర్ మ్యాన్: ఇన్ టూ ది స్పైడర్ వర్స్’ వంటి చిత్రాల దర్శకుడు క్రిస్టోఫర్ మిల్లర్ RRR సినిమాపై స్పందించారు. ‘RRR’ ఒక అద్భుత చిత్రమని, ఇది మైఖేల్ బే – బాజ్ లుహ్ర్మాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి ఒకే సినిమా రూపొందించడం వంటిదని ప్రశంసించారు. సినిమా 3 గంటలు ఉంది కానీ 4 గంటలైనా ఆస్వాదిస్తానని క్రిస్టోఫర్ మిల్లర్ ట్విట్టర్ వేదికగా మెచ్చుకున్నారు. అంతకుముందు డిస్నీ – మార్వెల్ స్టార్ అలిస్ ఎక్స్ జాంగ్ మరియు హాలీవుడ్ టీవీ రచయిత అమీ పాలెట్ హార్ట్ మన్ వంటి ప్రముఖులు టాలివుడ్ అద్భుతంపై ప్రశంసలు కురిపించారు.