ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను ఇప్పటికే స్విఫ్ట్ నుంచి నిషేధించారు. మరికొన్ని దేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా స్పందించింది. డిస్నీ, వార్నర్ బ్రదర్స్, సోనీ పిక్చర్స్ తమ రాబోయే థియేట్రికల్ చిత్రాలు రష్యాలో విడుదల చేయబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే రష్యాలో విడుదలైన ది బ్యాట్‌మ్యాన్ ని కూడా ఆపివేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఉద్భవిస్తున్న శరణార్థుల సంక్షోభం స్థాయిని బట్టి, తాము NGO భాగస్వాములతో సహాయం చేస్తామని వెల్లడించాయి. తాము అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల ఆధారంగా భవిష్యత్ వ్యాపార నిర్ణయాలు తీసుకుంటామని డిస్నీ ఒక ప్రకటనలో తెలిపింది.
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం