రోజాకు హోం మంత్రి బాధ్య‌త‌లు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేడు కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. న‌గ‌రి ఎమ్మెల్మే రోజాకు అనూహ్యంగా చివ‌రి నిమిషంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంకా ఆమెకు ఏ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారో తెలియ‌క‌ముందే రోజా వికీపీడియాలో ఉన్న స‌మాచారంలో హోంమంత్రిగా క‌న‌బ‌డుతోంది. ఆమె అభిమానులు అత్యుత్యాహంతో ఇలా చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది.
రోజాకు మంత్రి పదవి | Roja Minister Post Confirmed.! | AP New Cabinet Ministers | Ntv

Exit mobile version