విశాఖలో పరువు హత్య కలకలం సృష్టించింది. తనకు ఇష్టంలేని యువకుడ్ని ప్రేమించిందన్న కోపంతో కూతుర్ని హతమార్చాడు ఓ కసాయి తండ్రి. ఆమెను చంపిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి రాక్షస ఆనందం పొందాడు. అనంతరం నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. 13 ఏళ్ల క్రితమే నిందితుడి భార్య వదిలి వెళ్లి పోయినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుని అతన్ని వదిలి వెళ్లిపోయిందని.. ఇటీవల ఓ యువకుడ్ని చిన్న కూతురు ప్రేమించడంతో నిందితుడు ఆగ్రహానికి లోనయ్యాడని చెప్పుకొచ్చారు. దీంతో యువకుడ్ని మర్చిపోవాలంటూ గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు వివరించారు.
విశాఖలో పరువు హత్య కలకలం

yousay