మహిళా ఎస్ఐను ముగ్గురు ట్యాక్సీ డ్రైవర్లు వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన ఓడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శుభశ్రీ నాయక్ విధులు ముగించుకుని అర్ధరాత్రి తన కారులో ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ట్యాక్సీలో ముగ్గురు వ్యక్తులు ఆమెను వెంబడించారు. ఆమెను దారి మళ్లించి కారులో నుంచి దించి కత్తితో బెదిరించారు. వెంటనే మహిళా ఎస్ఐ తన ఫోన్‌లో అలారం బటన్ నొక్కగానే పోలీసులు అక్కడకు చేరుకుని తమ స్టైల్లో వారికి మర్యాదలు చేశారు.