పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా పలువురు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాని ఓ వ్యక్తి మాత్రం తన ప్రయాణం కోసం కొత్తగా ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. రోజూ దానిపై తన ఉద్యోగానికి వెళుతున్నట్లు చెబుతున్నాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన వ్యక్తి షేక్ యూసుఫ్. తాను YB చవాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉందని గుర్రాన్ని రూ.40 వేలకు కొనుగోలు చేసి వెళుతున్నట్లు తెలిపాడు. అయితే తనకు బైక్ ఉందని, సరిగా పనిచేయకపోవడం, పెట్రోల్ ధరల పెంపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.