ఆసుపత్రుల తీరు నేటికీ మారడం లేదు. నైపుణ్యం లేని వారి వల్ల బాలింతలు, చిన్న పిల్లలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. అయినా కానీ కొంత మంది మాత్రం మారడం లేదు. తాజాగా పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో కడుపుతో ఉన్న మహిళను ఆర్‌హెచ్‌సీ సిబ్బంది చావు అంచుల వరకూ తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేసిన వారు.. తల్లి కడుపులోనే బిడ్డ తలను అలాగే వదిలేశారు. దీంతో ఆ మహిళ పరిస్థితి క్రిటికల్‌గా మారింది. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో.. మరోసారి సర్జరీ చేసి బతికించారు.