ఐస్‌క్రీమ్ అంటే కూల్‌గా ఉంటుంది కదా. హాట్ ఐస్‌క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా జపాన్‌లోని హిరాటా అనే ఒక గ్రామలో ఈ వెరైటీ ఐస్‌క్రీమ్‌ను తయారుచేస్తారు. హాట్‌గా ఉండే ఈ ఐస్‌క్రీంపై హబనేరో అనే ఒక రకం స్పైసీ కారంపొడిని చల్లుతారు.ఇది తింటుంతే కస్టమర్ల కళ్లలోనుంచి కన్నీళ్లు రావడం ఖాయం. అయితే కస్టమర్లు వారి ఇష్టప్రకారమే దీన్ని తింటున్నట్లు ముందుగా కన్మర్మేషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తం ఐస్‌క్రీమ్ ఇప్పటివరకు ఎవరు తినలేదు. ఐస్‌క్రీం పూర్తిగా తింటే బిల్లు చెల్లించనక్కరల్లేదని ఆఫర్ కూడా ఉంది.