గోదావరి నదిలో నీటి లభ్యతపై ఏపీ, తెలంగాణ మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన జీఆర్ఎంబీ సమావేశంలో గూడెం ఎత్తిపోతల, మోడికుంట వాగు అనుమతులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా… గోదావరి కింద ఐదు ఉప బేసిన్ల పరిధిలో ప్రతి చుక్కపై తమకు హక్కు ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. తమ అభిప్రాయాలను బోర్డు కనీసం పరిగణలోకి తీసుకోవటం లేదని ఏపీ అధికారులు ప్రస్తావించారు. బోర్డు పోస్ట్మ్యాన్లా వ్యవహరిస్తోదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.