కోహ్లీ బెడ్రూం వీడియో లీక్పై ఆయన బస చేస్తున్న హోటల్ ‘క్రౌన్’ స్పందించింది. ఘటనపై తాము చింతిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇప్పటికే ఆ వీడియో తీసిన వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించామని క్రౌన్ పేర్కొంది. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఈ విషయంలో BCCI, ICCకి సహకరిస్తున్నామని క్రౌన్ రాసుకొచ్చింది.