రష్యా బాంబు దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన ఉక్రెయిన్ లో పలు నగరాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కీవ్ లో ఓ థియేటర్ తెరవగా తొలిరోజు మూడు ఆటలకు అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. రష్యా యుద్ధం ప్రకటించిన నుంచి లక్షల మంది ఉక్రెయిన్ ను వీడి విదేశాల బాట పట్టారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నగరాల్లో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటుండగా..జనం మానసిక ప్రశాంతత కోసం థియేటర్లకు వెళ్తున్నారు.