ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ రాత్రి పూట విచారించడం ఏమిటని ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్ ప్రశ్నించారు. మహిళలను ఇంటి వద్ద మాత్రమే విచారించాలని ఆయన తెలిపారు. మహిళలను ఇంటి దగ్గర మాత్రమే విచారించాలనే అంశాన్ని గుర్తుచేశారు. తప్పుడు కేసులతో కేంద్రం కవితను ఇబ్బంది పెడుతోందని భరత్ ఆరోపించారు. కాగా ఈనెల 8న కవితను రాత్రి 8 గంటల వరకు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.