టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. కె.ఎల్.నారాయణ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అయితే, ప్రస్తుతం మీడియాలో, చిత్ర పరిశ్రమలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఆయన పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాల పాటు ఉండనున్నట్లు సమాచారం. మహేష్ బాబు పాత్రకు సమానంగా బాలయ్యకు కూడా ప్రాధాన్యత ఉండేలా చూస్తున్నారట దర్శకుడు రాజమౌళి. అయితే, ఈ సినిమాలో బాలయ్య చేరిక గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.