సాధారణంగా మన దేశంలో సాయంత్రం పూట స్నాక్స్‌ను ఇష్టంగా తింటుంటారు. ఉత్తరాదిలో సమోసాలు ఎక్కువగా తీసుకుంటారు. అవి తక్కువ ధరలోనే దొరుకుతాయి కూడా. కానీ ఓ మహిళ ముంబై ఎయిర్ పోర్ట్‌లో తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని ట్విటర్లో రాసుకొచ్చారు. రెండు సమోసాలు, ఒక టీ, ఒక వాటర్ బాటిల్‌కు కలిపి ఏకంగా రూ.490 బిల్ వేశారని వాపోయింది. అదే బయట అయితే రూ.100లోపే ఖర్చువుతుందని పేర్కొంది. బిల్లుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.