పాత పింఛను పునరుద్ధరణ ఎలా..?

© Envato

హిమాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్‌కు ఒక చిక్కు వచ్చి పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆ పార్టీ పాత పింఛను విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది కాస్త కఠిన సవాలుగా మారింది. రాష్ట్రంలో దాదాపు 2.5లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో 1.5లక్షల మంది కొత్త పింఛను విధానం కింద ఉన్నారు. 2020-21 నాటికి పింఛన్లపై ప్రభుత్వం రూ. 6,088 కోట్లు వెచ్చించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో మనుగడ సాగిస్తున్న దృష్ట్యా ఈ హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పబోవని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Exit mobile version