రాజమౌళి సినిమాల్లో హీరో లుక్ కొత్తగా ఉంటుంది. ఈ క్రమంలో మహేశ్‌బాబుని కూడా సరికొత్తగా చూపిస్తారని అంతా భావించారు. కానీ, అలా ఏం ఉండదని జక్కన్న స్పష్టం చేశారు. మహేశ్ ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తారని వెల్లడించారు. లుక్పరంగా మార్పులు ఏం ఉండబోవని తెలిపారు. దర్శక ధీరుడి చిత్రాల్లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అందరూ సిక్స్ పాక్‌లతో ఫ్యాన్స్‌ను మెప్పించారు. మహేశ్ గురించి అలాంటి ప్రచారమే జరిగింది. కానీ, రాజమౌళి ప్రకటనతో అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.