సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్ళి, విడాకులు కొత్తేం కాదు. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం ఓ కుర్ర హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడట. ఆ మధ్య వీరిద్దరు కలిసి డిన్నర్ కు వెళ్లిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ హీరోయిన్ పేరు సబా ఆజాద్. హృతిక్ కుటుంబంతో, ఆయన మాజీ భార్య సుస్సన్నే ఖాన్ తో సైతం ఈ బ్యూటీ సన్నిహితంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.