తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబరు 30న ప్రారంభమైన TSPSC గ్రూప్ 4 దరఖాస్తులు 5 లక్షలకు చేరవయ్యాయి. ఈ నెల 18నాటికి 4,97,056 అప్లికేషన్లు వచ్చాయి. 8,039 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, గ్రూప్ 2 దరఖాస్తులు కూడా షురూ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 15,405 మంది దరఖాస్తు చేసినట్లు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది.