హైదరాబాద్- రామ్గోపాల్ పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్వేర్ స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న మిగతా షాపులకు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. నేట్వేర్ స్టోర్లో సిబ్బంది ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.