భారత్లో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 15 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటో మెుబైల్స్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. సుమారు 2,11,20,441 యూనిట్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. అయితే..కొవిడ్ ముందు సంవత్సరంతో పోలీస్తే మాత్రం 10 శాతం తగ్గాయట. ప్యాసింజర్స్ వెహికిల్ విభాగం కొత్త రికార్డులు నమోదు చేసిందని సమాచారం. ద్విచక్ర వాహన విభాగం మరోసారి విఫలమైంది. ట్రాక్టర్ల విక్రయాలు జీవితకాలం రికార్డు నమోదు చేశాయి.