తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తునివు(తెగింపు) మూవీకి భారీగా ఓపెనింగ్స్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.50కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. ఇంకా వచ్చే మూడు రోజులు హాలిడేస్ ఉండటంతో తేలికగా రూ.100 కోట్ల మార్కును అధిగమిస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ డైరెక్ట్ చేయగా.. జిబ్రాన్ సంగీతం అందించాడు. బోని కపూర్ ప్రొడ్యూస్ చేశారు.