ఉక్రెయిన్‌పై రష్యా గత మూడు నెలలుగా అలుపెరగని యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆదేశంలోని సగభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు వేగంగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే పుతిన్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పుతిన్ సలహాదారు పదవి నుంచి రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్ అల్లుడు వాలెంటిన్ యుమషేవ్ తప్పుకున్నారు. రష్యా రాజకీయాలపై పూర్తి పట్టు ఉన్న ఆయన తన పదవి నుంచి తప్పుకోవడంతో పుతిన్ సామ్రాజ్యం బీటలు వారుతుందని చర్చించుకుంటున్నారు. అటు ప్రజల్లో సైతం పుతిన్‌కు వ్యతిరేకత పెరుగుతోందని, ఇలానే కొనసాగితే అతను సైన్యంపై పట్టుకోల్పోవడం, అధికారం కోల్పోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.