కేరళలో ఆర్థికకంగా కలిసి వస్తుందని క్షుద్రపూజల్లో భాగంగా ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన నిందితులను ఇవాళ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి అక్టోబర్ 26 వరకు రిమాండ్ విధించింది. కొచ్చికి చెందిన పద్మ సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు. దర్యాప్తు చేసిన పోలీసులు…..మహమ్మద్ షఫీతో ఆమె అనేకసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, లైలా దంపతులు ఆమెను నరబలి ఇచ్చినట్లు వెల్లడించాడు. గతంలో మరో మహిళను కూడా ఇదే రీతిన హత్య చేసినట్లు తెలిపారు. చంపిన తర్వాత వారిని వండుకుని తిన్నట్లు విచారణలో వెల్లడించారు.