పలు సందర్భాల్లో భార్యభర్తలు గొడవ పడటం సర్వసాధారణం. కానీ ఇక్కడ జరిగిన లొల్లి మాత్రం ఏకంగా చంపుకునే స్థాయికి చేరింది. అసలు జరిగింది ఏటంటే భార్యభర్తలు ఇద్దరు కూర్చుని మద్యం సేవించారు. మంచి మత్తులో ఉన్నారు. అదే క్రమంలో భర్త భార్యను ఫుడ్ తీసుకురమ్మని చెప్పాడు. కానీ ఆమె అందుకు నో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త(47) భార్యను హత్య చేశాడు. ఈ ఘటన ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.