మద్యం సేవించిన ఓ వ్యక్తి తన భార్య మటన్ వండలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం రాత్రి మటన్‌తో ఇంటికి తిరిగొచ్చి, అతని భార్యను వండమని ఆదేశించాడు. అతని భార్య అందుకు నిరాకరించింది. దీంతో తనకు న్యాయం చేయాలని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. డయల్ 100 ఆపరేటర్లు అది చిలిపిగా భావించి తేలికగా తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న అతను కంట్రోల్ రూమ్‌కు ఆరుసార్లు ఫోన్ చేశాడు. దీంతో ఈ వ్యక్తికి గుణపాఠం చెప్పాలని అధికారులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా లోని చెర్ల గౌరారం గ్రామంలో చోటుచేసుకుంది.