బెంగళూరు రోడ్డు ప్రమాదం నవవధువు ఆశలను ఆవిరి చేసింది. నవ వధువు కళ్లముందే భర్త ప్రాణాలు కోల్పోయాడు. త్యాగరసవల్లికి చెందిన వెన్నెల(20), వెంకటేశపురానికి చెందిన అంజినప్ప(25)కు డిసెంబర్ 5న వివాహం జరిగింది. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం బైక్పై భార్యను తీసుకుని సొంతూరుకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజినప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.