గుడిసె కాలి ఏడుగురు సజీవ దహనం

© Envato

పంజాబ్‌లోని లూథియానాలో భీకర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 7గురు సజీవదహనం అయ్యారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వివరాల ప్రకారం.. లూథియానాలోని డంప్ యార్డ్ సమీపంలో వలస కార్మికుల కుటుంబం గుడిసెలో నివసిస్తుంది. తల్లిదండ్రులతో కలసి ఐదుగురు చిన్నారులు గుడిసెలో నిద్రపోతుండగా ఉన్నట్టుండి మంటలు వ్యాపించి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని లూథియానా(ఈస్ట్) అసిస్టెంట్ కమిషనర్ సురీందర్ సింగ్ పేర్కొన్నారు.

Exit mobile version