యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ కోహినూర్ హోటల్ బార్‌లో మయాంక్ తన గ్యాంగ్‌తో కలిసి వచ్చాడు. అదే సమయంలో ఓ యువతి విక్రమ్, విష్ణు అనే యువకులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే మయాంక్ ఫోన్ మాట్లాడుతూ యువతి వైపు వెళ్లగా.. అతని స్నేహితులు కూడా అతడిని ఫాలో అయ్యారు. ఇక్కడే మయాంక్‌తో పాటు అతని స్నేహితులు ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో విక్రమ్, విష్ణు వారిపై దాడి చేశారు. పరస్పరం దాడులు చేసుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనలో MLAకు చెందిన మనుషులు, ACP కొడుకు ఉండడంతో ఆచూతూచి వ్యవహరిస్తున్నారు.