పబ్.. అదో స్వర్గ సుఖాలకు షార్ట్ కట్ అని కొంత మంది చెబితే.. సమాజానికి పట్టుకున్న గబ్బని కొంత మంది వివరిస్తారు. ఎవరు ఎలా అనుకున్నా కానీ పబ్బుల్లోకి మైనర్లు (18 సంవత్సరాల కంటే చిన్నవారు) అనుమతించకూడదని చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఏదీ జరగడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. పబ్బులకు అనుమతులను ఇచ్చేది ఎక్సైజ్ శాఖ అధికారులు. ఏ తప్పు జరగకుండా చూడాల్సింది పోలీసులు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించడంతో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని అనేక మంది చెబుతున్నారు. ప్రస్తుతం అమ్నేషియా పబ్ వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది.