హైదరాబాద్ ఒక సుప్రసిద్ధ నగరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అని పేర్కొన్నారు. ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా నగరాన్ని పవర్ ఐలాండ్‌గా మార్చామని సీఎం చెప్పారు. న్యూయార్క్, లండన్, పారిస్‌లలో కరెంట్ పోతుందేమోగానీ.. హైదరాబాద్‌లో పోదన్నారు. నగరం కాలుష్య రహితంగా మారాలంటే మెట్రో రైళ్లు అవసరమని పేర్కొన్నారు.