హైదరాబాద్‌లో స్మార్ట్ లైటింగ్ ఏర్పాటు చేసేందకు ఫిలిప్స్ సంస్థ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కంపెనీకి 225 స్మార్ట్ హబ్స్ ఉండగా, హైదరాబాద్‌లో ప్రస్తుతం 5 స్టార్ట్ హబ్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 300 ఏర్పాటు చేయననుండగా హైదరాబాద్‌లో వాటి సంఖ్య 10-12కి పెంచనుంది. స్మార్ట్ లైటింగ్‌ను ప్రజలు స్వీకరించడం ఇప్పుడే ప్రారంభమైంది. ఇది ఒక్కసారి వేగం పుంజుకుంటే, అది నిలువుగా వృద్ధి చెందుతుంది ఫిలిప్స్ ఇండియా ఎండీ సుమిత్ జోషి అన్నారు.